SKLM: ఎచ్చెర్ల మండలంలోని పలు గ్రామాలు ఎండ తాపానికి అల్లాడుతున్నాయి. భానుడి ప్రతాపానికి జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మంగళవారం ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతుండటంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. పనులకు వెళ్లే కూలీలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి ఎద్దడి కూడా తలెత్తుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎండ తాపానికి అల్లాడుతున్న ఎచ్చెర్ల మండల ప్రజలు


