హైదరాబాద్: 28°C
వార్తలు

కూటమి అభ్యర్థులను గెలిపించండి: పురందేశ్వరి

AP: రాజమహేంద్రవరంలో నిర్వహించిన ‘బీజేపీ వంద జెండాల పండుగ’ కార్యక్రమానికి ఎంపీ పురందేశ్వరి హాజరయ్యారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని అన్ని ప్రాంతాల్లో బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. కూటమి పార్టీలు కలిసి పోటీ చేస్తాయని తెలిపారు. కూటమి అభ్యర్థులను గెలిపించేలా ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.