హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా రాములవారి నిత్య కళ్యాణం

BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో మంగళవారం నిత్య కల్యాణ వేడుక కన్నుల పండువగా సాగింది. అర్చకులు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ముస్తాబు చేసి పల్లకీలో కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం అనంతరం శాస్త్రోక్తంగా మాంగల్యధారణ జరిపించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.