హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదం.. లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

KMM: పెనుబల్లి మండలంలోని వీఎం బంజర్‌ రింగ్‌ సెంటర్‌లో మంగళవారం రెండు లారీలు ఢీకొనగా ఒక లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే గాయపడిన వ్యక్తిని పెనుబల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.