హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అప్పనపల్లి వద్ద RTC బస్సుకు అడ్డంగా బైక్లు

MBNR: జడ్చర్ల నుంచి మహబూబ్‌నగర్ వెళ్తున్న RTC బస్సును అప్పనపల్లి బస్టాప్ వద్ద విద్యార్థుల బంధువులు బైక్లు అడ్డంగా పెట్టి నిలిపివేశారు. విద్యార్థులను బస్సులోకి ఎక్కించుకోకుండా వెళ్లడంపై డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు. ప్రయాణికులు కలగజేసుకుని బస్సును అడ్డుకోవడం, సిబ్బందితో గొడవపడటం సరికాదని సూచించారు. సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు.