హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలల్లో పారిశుద్ధ్య తనిఖీలు

RR: ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ పాత కొత్తపేట, సరూర్‌నగర్ ఎన్టీఆర్ నగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలతో పాటు భగత్ సింగ్ నగర్‌లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఇవాళ తనిఖీ చేశారు. పాఠశాలల్లోని శౌచాలయాల పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ ఏర్పాట్లను సమీక్షించి, విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా నిరంతరం పరిశుభ్రత పాటించాలని అధికారులను ఆదేశించారు.