హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మాల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ వద్ద నిరసన

HYD: స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన BRS ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాల సంఘాల ఐక్య వేదిక రాస్తారోకో చేపట్టింది. దళిత స్పీకర్‌ను అగ్రకుల అహంకారంతో అవమానించారని ఆరోపించారు. ఈ ఘటన వెనుక కేసీఆర్ హస్తముందని, ఆయన వెంటనే మాల జాతికి క్షమాపణ చెప్పాలన్నారు.