GDWL: అలంపూర్ పట్టణంలో గాంధీ చౌక్ నుంచి రైతు సంఘం వరకు ఇటీవల రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యాయి. కానీ గాంధీ చౌక్ దగ్గర మూలమలుపు ఉండటంతో అలంపూర్ ఆలయాలకు వెళ్లే వాహనదారులు చాలా రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో నేడు మున్సిపాలిటీ అధికారులు స్పందించి గాంధీ విగ్రహాన్ని తొలగించి సమస్యను పరిష్కరించారు. విగ్రహాన్ని మరోచోట ఏర్పాటు చేస్తామన్నారు.
తెలంగాణ
అలంపూర్‌లో తీరనున్న ట్రాఫిక్ సమస్యలు


