హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ నియంత్రిక, స్తంభానికి పిచ్చిమొక్కలు

VKB: కోట్‌పల్లి మండలంలోని మోత్కుపల్లి గ్రామంలో ఉన్న విద్యుత్ నియంత్రిక, స్తంభానికి పిచ్చిమొక్కలు అల్లుకుని ప్రమాదకరంగా మారింది. నియంత్రికకు కంచె లేకపోవడంతో మూగజీవాలు సైతం గాయాల పాలవుతున్నాయన్నారు. వర్షాకాలం కావడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కంచె ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.