హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎడ్లబండే విద్యార్థులకు బస్సు

NRML: నర్సాపూర్ జి (M) బామిని గ్రామంలో సరైన రోడ్డు సౌకర్యం, బస్సు సర్వీస్ లేకపోవడంతో విద్యార్థులు ఎడ్లబండిపై బడిబాట పడుతున్నారు. దారులు అధ్వానంగా ఉండటంతో చిన్నారులు నిత్యం కిలోమీటర్ల బురద దారుల్లో ప్రయాణం చేస్తూ పాఠశాలలకు వెళ్తున్నారు. దశాబ్దాలుగా వేధిస్తున్న ఈ రవాణా సమస్యపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే రోడ్డు వేయించి, బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.