హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాహనాలు అడ్డుగా.. ప్రజలకు ఇబ్బందులు

ADB: ఆదిలాబాద్ గ్రామీణ మండల పరిషత్ కార్యాలయం లోపలికి వెళ్లేదారిలో అడ్డంగా వాహనాలు నిలిపి ఉంచుతున్నారు. దీంతో కార్యాలయానికి ఆయా గ్రామాల నుంచి వచ్చే అర్జీదారులు వెళ్లడానికి అవస్థలు పడుతున్నారు. పక్కనే పార్కింగ్ స్థలం ఉన్నప్పటికీ ఇష్టా రీతిన వాహనాలు నిలపడం సరికాదని స్థానికులు పెర్కొంటున్నారు.