హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అక్రమ ఇసుక రవాణా అడ్డుకోవాలని మహిళల ఆందోళన

BHPL: మొగుళ్లపల్లి మండలం పోతుగల్లు గ్రామంలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని మహిళలు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. గ్రామ శివారులోని వాగు నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారని వారు ఆరోపించారు. అక్రమ రవాణాతో గ్రామానికి ఇబ్బందులు కలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి ఇసుక తరలింపును నిలిపివేసి చర్యలు తీసుకోవాలన్నారు