హైదరాబాద్: 28°C
తెలంగాణ

డెంగ్యూ నివారణ చర్యలు ముమ్మరం

KMR: మాచారెడ్డి మండల కేంద్రంలో డెంగ్యూ కేసులు నమోదైన నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. వెంకట్ ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటా జ్వరాల సర్వే, దోమల లార్వా గుర్తింపు కోసం సిబ్బంది నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని పరిశీలించారు. నీటి డ్రమ్ములు, కూలర్లు, పాత టైర్లు తదితర ప్రాంతాల్లో లార్వాను గుర్తించి వెంటనే నివారణ చర్యలు చేపట్టాలన్నారు