హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇస్లాంపూర్ ప్రాంతంలో డ్రై డే కార్యక్రమం

కామారెడ్డి: పట్టణంలోని UPHC ఇస్లాంపూర్ పరిధిలో ఇవాళ ఇస్లాంపూర్ ప్రాంతంలో డ్రై డే, యాంటీ లార్వల్ కార్యక్రమాలు నిర్వహించారు. దోమల వృద్ధిని అరికట్టేందుకు నిల్వ ఉన్న నీటిని తొలగించడం, లార్వా నివారణ చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రవీందర్ తదితర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.