హైదరాబాద్: 28°C
తెలంగాణ

వికలాంగుల పెన్షన్ పెంపుదల సాధిస్తాం: కృష్ణ మాదిగ

KMM: ప్రభుత్వం మెడలు వంచి వికలాంగులకు పెంచవలసిన పింఛన్లు సాధిస్తామని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ తెలిపారు. మంగళవారం ఖమ్మం SR కన్వెన్షన్ హాల్‌లో జరిగిన వికలాంగుల కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం వికలాంగుల పట్ల చూపిన చొరవ తెలంగాణ ప్రభుత్వం చూపటం లేదని అన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం చిత్తశుద్ధితో పింఛన్‌లను పెంచాలని కోరారు.