హైదరాబాద్: 28°C
తెలంగాణ

మత్తడి వాగు ప్రాజెక్టులో తాజా నీటి వివరాలు

ADB: తాంసి మండలంలోని మత్తడి వాగు ప్రాజెక్టు నీటిమట్టం స్థిరంగా కొనసాగుతోందని AEE హరీశ్ తెలిపారు. మంగళవారం ప్రాజెక్ట్ నీటిమట్టం పూర్తిస్థాయి నీటిమట్టం 277.50 మీటర్లకు (910 అడుగులు) చేరుకుందని వెల్లడించారు. ప్రాజెక్ట్ సవరించిన పూర్తి సామర్థ్యం 0.470 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అదే స్థాయిలో నీరు నిల్వ ఉందని హరీశ్ పేర్కొన్నారు.