హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ ఉత్సవాలు.. వారికి సెలవులు రద్దు

HYD: సెప్టెంబర్ 14-25 వరకు జరిగే గణేష్ ఉత్సవాల సందర్భంగా TGSPDCL సిబ్బందికి సాధారణ సెలవులు రద్దు చేసినట్లు సంస్థ ఎండీ జితేశ్ వి.పాటిల్ తెలిపారు. నగర వ్యాప్తంగా నిరంతర విద్యుత్ సరఫరా కోసం అధికారులు, సిబ్బంది 24గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రధాన నిమజ్జన కేంద్రాలు, ఊరేగింపు మార్గాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.