హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఫీజు, బకాయిలు వెంటనే విడుదల చేయాలి'

BHPL: తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేశాయి. భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ వద్ద సుమారు 100 మంది విద్యార్థులతో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. బకాయిలు చెల్లించకపోవడంతో 30 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని నాయకులు అన్నారు.