SRCL: కోనరావుపేట మండలం నిమ్మపల్లి శివారులో మూలవాగుపై నిర్మించిన హైలెవల్ బ్రిడ్జి ఇరుకుగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎదురెదురుగా వాహనాలు వస్తే రాకపోకలు నిలిచిపోతున్నాయి. బ్రిడ్జికి ఇరువైపులా రోడ్డు గుంతలమయంగా మారడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అధికారులు స్పందించి గుంతలను పూడ్చాలని వాహనదారులు కోరుతున్నారు.
తెలంగాణ
ప్రమాదకరంగా మారిన రహదారి


