హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిద్ధేశ్వర ఆలయంలో అమ్మవారికి వెండి ముఖ కవచం

JN: బచ్చన్నపేట మండలం కొడవటూరు స్వయంభు సిద్ధేశ్వర స్వామి ఆలయంలో అగ్నిగుండ మహోత్సవం సందర్భంగా భక్తి వైభవం నెలకొంది. భద్రకాళి అమ్మవారికి ఆలయ కమిటీ డైరెక్టర్‌ భీమ్‌రెడ్డి మల్లారెడ్డి, కవిత దంపతులు సుమారు రూ.లక్ష విలువైన వెండి ముఖ కవచాన్ని సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్‌ వెంకటరెడ్డి, ఈవో చిందం వంశీ, ప్రధాన పూజారి ఓం నమశివాయ తదితరులు పాల్గొన్నారు.