హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మెరిసే చర్మానికి సింపుల్ చిట్కా

ఆరోగ్యానికే కాకుండా సౌందర్యానికి కూడా బీట్‌రూట్ ఎంతో మేలు చేస్తుంది. బీట్‌రూట్ రసంలో పెరుగు కలిపి ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత కడిగితే మచ్చలు తగ్గుతాయి. అలాగే బీట్‌రూట్ రసం, ఓట్స్ మిశ్రమంతో చర్మాన్ని స్క్రబ్ చేసుకుంటే రక్తప్రసరణ మెరుగై చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుందని నిపుణులు సూచిస్తున్నారు.