హైదరాబాద్: 28°C
క్రైమ్

భారీ అగ్నిప్రమాదం.. నిలిచిన వాహనాల రాకపోకలు

TG: HYD చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ వెనుక మూసీ నది పరివాహక ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో చాదర్‌ఘాట్ సర్కిల్ నుంచి ఎక్స్ రోడ్స్ వైపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు మలక్‌పేట్ ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. వాహనదారులు పోలీసుల సూచనలు పాటించాలని, ప్రయాణానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.