హైదరాబాద్: 28°C
వార్తలు

'ఆశా వర్కర్ల దర్నాను జయప్రదం చేయండి'

BPT: ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 31న చేపట్టబోయే కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయాలని యూనియన్ చీరాల నాయకురాలు శీలమ్మ పిలుపునిచ్చారు. ఈ మేరకు మరియంపేట యూపీహెచ్‌సీ వైద్య అధికారి డాక్టర్ స్వాతి కిరణ్‌కు డిమాండ్ల పత్రాన్ని అందజేశారు. మార్చి 5న ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే జీవో రూపంలో అమలు చేయాలని శీలమ్మ డిమాండ్ చేశారు.