హైదరాబాద్: 28°C
క్రైమ్

VIDEO: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

TPT: గూడూరు మండలం తిప్పవరపాడు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గూడూరు నుంచి సైదాపురం వైపు మోటార్ సైకిల్ పై వెళ్తున్న రుద్రరాజు వెంకటేశ్వరరాజు అనే వ్యక్తి రోడ్డు పక్కన ఉన్న మట్టి దెబ్బలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి ఇటీవల వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.