హైదరాబాద్: 28°C
వ్యాపారం

మరోసారి అమెరికా కోర్టుకు అదానీ

అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ మరోసారి అమెరికా కోర్టులో హాజరుకానున్నారు. అదానీ-అమెరికా లీగల్ వివాదంలో తనపై ఉన్న క్రిమినల్ అభియోగాలను పూర్తిగా కొట్టివేయాలన్న అమెరికా ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించి అదానీ ఈ వారంలోనే  కోర్టులో కీలక అఫిడవిట్ సమర్పించారు. ఈ కేసు ఉపసంహరణ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందా లేదా అనే నిర్థారించుకోవడానికే ధర్మాసనం విచారణ జరపనుంది.