హైదరాబాద్: 28°C
వ్యాపారం

SBI నుంచి మెగా IPO

SBI ఫండ్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ IPOకు వస్తోంది. ప్రైస్ బ్యాండ్‌ను ఒక్కో షేర్‌కు రూ.545-574గా, ఒక్కో లాట్‌ పరిమాణాన్ని 26 షేర్లుగా కంపెనీ నిర్ణయించింది. ఈనెల 14 నుంచి 16 వరకు ఇష్యూ కొనసాగనుంది. 21న స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లలో షేర్లు లిస్ట్ అవుతాయి. ఆఫర్ ఫర్ సేల్ కింద SBI 12.83 కోట్లు, అముండి ఇండియా 7.56 కోట్ల షేర్లను విక్రయించనున్నాయి.