హైదరాబాద్: 28°C
క్రీడలు

TG20: ఫైనల్‌కు చేరిన ఖమ్మం ఏసెస్

అన్విత ఖమ్మం ఏసెస్ జట్టు టీజీ20 లీగ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఖమ్మం 200/6 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్.. 190/8 పరుగులకు పరిమితమైంది. ఖమ్మం బౌలర్లలో సహేంద్ర 3, వేద్‌రెడ్డి 2 వికెట్లు తీశారు.