W.G: ఉంగుటూరు నియోజకవర్గ ప్రజాసమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో ఇవాళ 'జనవాణి' కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉంగుటూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించనున్నారు. అందిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులతో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.
వార్తలు
ఎమ్మెల్యే నేటి 'జనవాణి' కార్యక్రమం


