హైదరాబాద్: 28°C
క్రీడలు

TG20 క్వాలిఫయర్-1: ఖమ్మం భారీ స్కోర్

హైదరాబాద్ ఈ ఛాంపియన్స్‌తో జరుగుతున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఖమ్మం ఏసెస్ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఖమ్మం నిర్ణీత 20 ఓవర్లలో 200/6 పరుగులు చేసింది. మిఖిల్ జైస్వాల్ (76) హాఫ్ సెంచరీతో చెలరేగగా, GSK రెడ్డి 31, పరాస్ రాజ్ 32 పరుగులతో రాణించారు. HYD బౌలర్లలో అఖిల్ రాథోడ్ 2.. దేవ్, షణ్ముఖ, ప్రణవ్, అజయ్ తలో వికెట్ తీశారు.