హైదరాబాద్: 28°C
క్రీడలు

వేలం నుంచి వైదొలిగిన సంజూ శాంసన్

కేరళ క్రికెట్ లీగ్ నుంచి సంజూ శాంసన్ వైదొలిగాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ సీజన్ వేలానికి అతడు తన పేరును నమోదు చేసుకోలేదు. గత సీజన్‌లో సంజూ 'కొచ్చి బ్లూ టైగర్స్' జట్టు తరపున బరిలోకి దిగాడు. కాగా, ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఆడుతున్న సంజూకు, ఆ తర్వాత జరగబోయే జింబాబ్వే సిరీస్‌కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు.