TG: పెద్దపల్లి జిల్లాలో స్కూల్ పిల్లలకు తృటిలో ప్రమాదం తప్పింది. కాల్వ శ్రీరాంపూర్ మండలం మంగపేట దగ్గర స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కరెంట్ పోల్‌ని బస్సు ఢీకొట్టింది. ఒక్కసారిగా శబ్ధం రావడంతో బస్సులోని చిన్నారులు భయంతో వణికిపోయారు. డ్రైవర్ మద్యం మత్తులో బస్సు నడిపినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. స్కూల్ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు.
క్రైమ్
కరెంట్ పోల్‌ని ఢీకొట్టిన స్కూల్ బస్సు


