ప్రకాశం: శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మార్కాపురంలోని జవహర్ నగర్‌లో ఉన్న టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొననున్నారు. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకొచ్చారు.
వార్తలు
ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రేపు పబ్లిక్ గ్రీవెన్స్.


