హైదరాబాద్: 28°C
క్రైమ్

30 తులాల బంగారం చోరీ

AP: అనంతపురం జిల్లా కోయినగర్‌లో దొంగలు ఓ ఇంట్లో 30 తులాల బంగారు ఆభరణాలు, 50 తులాల వెండి, రూ.20 వేల నగదును ఎత్తుకెళ్లారు. ఉమాదేవి గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో పాయింట్‌ మెన్‌గా పని చేస్తున్నారు. నిన్న రా.9 గంటలకు ఆమె విధులకు వెళ్లగా.. తెల్లవారుజామున దుండగులు తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఎత్తుకెళ్లారు. ఇంట్లోని దుస్తులు, వస్తువులను కాల్చి వెళ్లిపోయారు.