హైదరాబాద్: 28°C
క్రైమ్

విజయవాడ భారీగా నల్లమందు ప‌ట్టివేత‌

AP: విజయవాడ పటమట పోలీసులు రాజస్థాన్‌కు చెందిన ముకేష్ అనే వ్యక్తి నుంచి 650 గ్రాముల నల్లమందును స్వాధీనం చేసుకున్నారు. మంగళగిరి కేంద్రంగా గ్రాము రూ.2,600 చొప్పున (కిలో రూ.26 లక్షలకు పైగా) అతడు విక్రయాలు జరుపుతున్నాడు. గతంలో నగర బహిష్కరణకు గురైన ముకేష్‌ను పోలీసులు నిన్న రహస్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ అతడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.