ICC హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న సౌరవ్ గంగూలీకి సచిన్ టెండూల్కర్ SM వేదికగా ప్రత్యేక అభినందనలు తెలిపాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధాన్ని కూడా గుర్తుచేసుకున్నాడు. 'మాకు 14 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే ఒకరినొకరు తెలుసు. అందువల్ల మా మధ్య ఆశ్చర్యపడే విషయాలు ఏవీ మిగలలేదు. నీకీ గౌరవం దక్కడం కూడా నాకు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు' అంటూ సచిన్ వ్యాఖ్యానించాడు.
క్రీడలు
'దాదా'కు సచిన్ అభినందనలు


