హైదరాబాద్: 28°C
క్రీడలు

TG20: కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన తన్మయ్

TG20 లీగ్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో కరీంనగర్ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ సెంచరీతో చెలరేగాడు. రంగారెడ్డి రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తన్మయ్ కేవలం 48 బంతుల్లోనే సెంచరీ పూర్తీ చేసుకున్నాడు. అతడికి తోడుగా సింహా 41 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. దీంతో కరీంనగర్ జట్టు 13.2 ఓవర్లలోనే 160/1 పరుగులు చేసి భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది.