హైదరాబాద్: 28°C
వార్తలు

'సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటా'

KRNL: తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పేర్కొన్నారు. గురువారం కోడుమూరులో ఉన్న హంద్రీనీవాను ఆయన పరిశీలించారు. గాజులదిన్నె ప్రాజెక్ట్ నుంచి తక్షణమే నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్ట్ నుంచి వచ్చే నీటిని హంద్రీ నదికి మళ్లించి తాగునీటి కొరతను అధిగమిస్తామని హామీ ఇచ్చారు.