హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs ENG: లార్డ్స్‌లో చారిత్రాత్మక పోరు

ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ స్టేడియం వేదికగా మొట్టమొదటి మహిళా టెస్టు మ్యాచ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో భారత్, ఇంగ్లండ్ మహిళల జట్లు తలపడనున్నాయి. గత రికార్డులను పరిశీలిస్తే.. ఇప్పటివరకు ఆడిన 15 టెస్టుల్లో భారత్ 3 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించగా, ఇంగ్లండ్ 11 గెలిచి స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది.