సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ వింబుల్డన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్ ఫైనల్లో జకోవిచ్ 7-6 (12-10), 3-6, 6-3, 6-7 (4-7), 7-6 (10-4) తేడాతో కెనడాకు చెందిన ఫెలిక్స్ అగర్‌పై ఘన విజయం సాధించాడు. 5 గంటల 15 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్.. వింబుల్డన్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన క్వార్టర్ ఫైనల్‌గా రికార్డు సృష్టించింది.
క్రీడలు
వింబుల్డన్ సెమీస్‌లో జకోవిచ్


