హైదరాబాద్: 28°C
వార్తలు

పెండింగ్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్

ప్రకాశం: ముండ్లమూరు మండలంలో ఈనెల 11న లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఎస్సై కోటేశ్వరరావు తెలిపారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసులతో పాటు రాజీ ద్వారా పరిష్కరించగలిగే ఇతర అర్హత కలిగిన కేసుల పక్షాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పరస్పర అంగీకారంతో వివాదాలను త్వరితగతిన పరిష్కరించుకుని లోక్ అదాలత్ సేవలను వినియోగించుకోవాలన్నారు.