హైదరాబాద్: 28°C
వార్తలు

అక్రమంగా ఇసుక తవ్వకాలపై డీఆర్వోకు ఫిర్యాదు

ప్రకాశం: జరుగుమల్లి (M) చింతలపాలెం సమీపంలో ఉన్న పాలేరులో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని గడ్డం రవీంద్ర DRO కటరమణకు గురువారం వ్రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. తమ గ్రామానికి ఏట్లో మంచినీటి బావి ఉందని గ్రామం మొత్తానికి అక్కడ నుంచే మంచినీటి సరఫరా అవుతుంది అన్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతోపాటు ఇసుక తవ్వకాలు ఇంకా కొనసాగితే ఉప్పునీరు వచ్చే పరిస్థితి ఉందని పేర్కొన్నారు.