హైదరాబాద్: 28°C
క్రీడలు

TG20 ఎలిమినేటర్: టాస్ గెలిచిన కరీంనగర్

TG20 ముగింపు దశకు చేరుకుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్, కరీంనగర్‌ డైమండ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కరీంనగర్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇందులో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. దీంతో ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది.