హైదరాబాద్: 28°C
క్రైమ్

కిచిడీలో పురుగులు.. 26 మందికి అస్వస్థత

TG: నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూరు ఎస్టీ గురుకులంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కిచిడి తిన్న తర్వాత 26 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. వాంతులు, కడుపునొప్పితో బాధపడుతున్న ఎస్టీ గురుకులం విద్యార్థులను అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చించారు. ఉదయం పెట్టిన కిచిడీలో పురుగులు వచ్చాయని ఇతర విద్యార్థులు ఆరోపిస్తున్నారు.