హైదరాబాద్: 28°C
క్రీడలు

అక్తర్ రికార్డే నా టార్గెట్: అశోక్ శర్మ

IPL-2026 సీజన్‌లో GT ఫాస్ట్ బౌలర్ అశోక్ శర్మ 154.2 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. ఏదో ఒకరోజు షోయబ్ అక్తర్ ప్రపంచ రికార్డును (161.3 KMPH) బద్దలు కొడతానంటూ ధీమా వ్యక్తం చేశాడు. అయితే, ఈ మైలురాయిని అందుకోవడం అంత సులువు కాదని, ఇందుకోసం తాను తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.