హైదరాబాద్: 28°C
క్రీడలు

9 నెలలైనా చేతికి రాని ఆసియా కప్..!

'ఆసియా కప్-2025' ట్రోఫీని భారత్ గెలుచుకుని దాదాపు 9 నెలలు పూర్తయింది. అయితే, ఇప్పటికీ ఆ ట్రోఫీ భారత జట్టు చేతికి రాలేదు. దీనిపై తాజాగా BCCI ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందిస్తూ.. 'ఆసియా కప్ ట్రోఫీ గురించి ACC ఛైర్మన్ నఖ్వీ, అలాగే ఇతర డైరెక్టర్లతో మాట్లాడాం. కానీ, వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. మేము గెలిచిన ట్రోఫీ ఎప్పటికైనా మాకే సొంతం' అంటూ ఆయన వ్యాఖ్యానించారు.