హైదరాబాద్: 28°C
వ్యాపారం

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిరతతో ఇన్వెస్టర్లు అప్రమత్తం కావడంతో సూచీలు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 1,677.12 పాయింట్లు నష్టపోయి 76503.60 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 516.65 పాయింట్ల నష్టంతో 23882.05 దగ్గర ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.63గా ఉంది.