సత్యసాయి: హిందూపురం మండలం ముదిరెడ్డిపల్లి మోడల్ ప్రైమరీ స్కూల్ పీఎస్‌హెచ్ దేవరాజును జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణప్ప సస్పెండ్ చేశారు. పాఠశాల బాలికలపై అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీనిపై మండల విద్యాశాఖ అధికారి సమర్పించిన సమగ్ర నివేదిక ఆధారంగా దేవరాజును విధుల నుంచి సస్పెండ్ చేస్తూ డిప్యూటీ ఈవో ఉత్తర్వులు జారీ చేశారు.
వార్తలు
బాలికలపై అనుచిత ప్రవర్తన: పీఎస్‌హెచ్ సస్పెండ్


