హైదరాబాద్: 28°C
వార్తలు

31న ఆశా వర్కర్ల కలెక్టరేట్ ధర్నా

BPT: ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 31న చేపట్టే కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయాలని యూనియన్ బాపట్ల జిల్లా కార్యదర్శి ఎం.వెంకటేశ్వరమ్మ కోరారు. చీరాల వైకుంటపురం యూపీహెచ్‌సీ డాక్టర్‌కు ఆమె డిమాండ్ల పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం గత మార్చిలో అంగీకరించిన 11 డిమాండ్లపై తక్షణమే జీవోలు ఇవ్వాలని, పెరిగిన పని ఒత్తిడిని, అదనపు బీఎల్వో డ్యూటీలను అరికట్టాలని కోరారు.