హైదరాబాద్: 28°C
వార్తలు

'దివ్యాంగులకు సబ్సిడీ లోన్లు ఇవ్వాలి'

బాపట్ల జనసేన కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్‌కు దివ్యాంగుల జనసైనికులు గోగన ఆదిశేషు, కోకి రాజశేఖర్‌ వినతి పత్రం ఇచ్చారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు తోపుడు బండ్లు, సబ్సిడీ లోన్లు మంజూరు చేయాలని కోరారు. అలాగే అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలలో వీరికి ప్రత్యేక అవకాశాలు కల్పించి ఆదుకోవాలని అభ్యర్థించారు.