హైదరాబాద్: 28°C
వార్తలు

కలెక్టర్‌ను కలిసిన చేనేత శాఖ ఏడీ

కృష్ణా: చేనేత, వస్త్రాల శాఖ సహాయ సంచాలకులుగా సిహెచ్ విజయబాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీని కలెక్టరేట్‌లోని చాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. నూతన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తానని విజయబాబు తెలిపారు. జిల్లాలో చేనేత రంగ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.